భాషలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా, అచారాలు వేరైనా .. అనుబందానికి అవి అడ్డురావని నిరూపించింది ఈ జంట. అగ్ని సాక్షిగా పెళ్లితో ఆదిలాబాద్ అబ్బాయి, ఇంగ్లాండ్ అమ్మాయి ఒక్కటయ్యారు.అనుబందాలు.. బందాలకు ఎల్లలు లేని నిరూపించారు.. ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఆ దంపతులను అందరు అభినందించారు.. ఆదిలాబాద్ జిల్లాలో ఇంగ్లాండ్ అమ్మాయి, అదిలాబాద్ అబ్బాయి పెళ్లి పై వీ6 న్యూస్ స్పేషల్ రిపోర్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కు చెందిన భూశెట్టి మహేందర్ భారతిల కుమారుడు భూశెట్టి సాయి చరణ్ పదేళ్ల క్రితం కు లండన్ కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే వ్యాపారం లో స్థిరపడ్డారు. అదే సమయంలో లండన్ లోని కార్డిప్ చెందిన కిమ్ హెనోచ్ - గారెత్ హెనోచ్ ల కూతురు మియా మే తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సాయిచరణ్ - మియామే లు పెద్దలను ఒప్పించి మూడు ముళ్లతో ఒక్కటవ్వాలని కోరుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో మే 10 న అంగరంగ వైభవంగా సాగిన వివాహవేడుకలో ఏడడుగులు వేసి మూడు ముళ్లతో ఇద్దరు.. ఒక్కటయ్యారు. మియామే తల్లిదండ్రులు ఇండియాకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సాయిచరణ్ మేనత్త పెళ్లి కూతురు తరుపున వివాహం జరిపించారు.
గత నెల ఇద్దరు కలిసి భారతదేశానికి వచ్చి ఇక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. వధువు మియామే కు తెలంగాణ సంప్రదాయాలు అందులోను ఆదిలాబాద్ వాతవరణం నచ్చడంతో హిందు సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకోవాలని భావించింది. ఆమె కోరిక మేరకు భారత్ వచ్చిన ఈ జంట పెద్దల సమక్షంలో సంప్రదాయబద్దంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అయితే ఈ పెళ్ళి వధువు మియామే తల్లిదండ్రులు రాకపోవడంతో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బోడకుంటి నితీష్ వనజ దంపతులు కన్యాదానం చేసి పెళ్లి జరిపించారు. వారి దేశాలు, భాషలు వేరు వేరు అయినప్పటి వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు సాయిచరణ్ - మియామేలు. ఈ వివాహానికి హాజరైన సాయిచరణ్ బంధుమిత్రులు అంతా నూతన దంపతులను ఆశీర్వదించి అభినందించారు.మూడు మూళ్ల బంధానికి దేశం, భాష అడ్డుకావని, ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఈ పెళ్ళి గురించే అంతటా చర్చ కొనసాగుతోంది.
