రోడ్డుపై దొరికిన రూ. 2.40 లక్షలు.. పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్న వ్యక్తి

రోడ్డుపై దొరికిన రూ. 2.40 లక్షలు.. పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్న వ్యక్తి

నిర్మల్, వెలుగు: రోడ్డుపై దొరికిన డబ్బులను పోలీసులకు అప్పగించి ఓ వ్యక్తి నిజాయతీ చాటుకున్నాడు. నిర్మల్ టౌన్ ఆదర్శనగర్ కు చెందిన విజయ్ కుమార్ మంగళవారం బస్టాండ్ వైపు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో కోర్టు వద్ద హోండా బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తికి చెందిన రూ. 2 .40 లక్షలు నగదు రోడ్డుపై పడ్డాయి. వాటిని చూసిన విజయ్ కుమార్ పలుమార్లు పిలిచినా అతడు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. డబ్బులు దొరికిన విషయం  వెంటనే ఇంటెలిజెన్స్ ఎస్ఐ సాయన్ రావుకు తెలిపి అప్పగించాడు. విజయ్ కుమార్ ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.