షారుఖ్కు ఘాటు ముద్దుపెట్టిన దీపిక.. స్పందించిన భర్త రణ్వీర్

షారుఖ్కు ఘాటు ముద్దుపెట్టిన దీపిక.. స్పందించిన భర్త రణ్వీర్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) డ్యూయల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(JAwan). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో.. నయనతార(Nayanatara), దీపికా పదుకొనే(Deepika padukone) హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై ఈ సినిమాకు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను చేసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. కేవలం వారంరోజుల్లోనే ఈ సినిమా రూ.700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ALSO READ: విశాల్ దర్శకత్వంలో విజయ్ మూవీ.. స్వయంగా ప్రకటించిన హీరో

ఇందులో భాగంగా తాజాగా జవాన్ మంచి సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి జవాన్ హీరో షారుక్, దర్శకుడు అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తోపాటు దీపికా పదుకొనే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీపికా షారుఖ్‌ని పట్టుకుని  గట్టిగా ఒక ఘాటు ముద్దు పెట్టుకుంది. ఆ ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీపికా పెట్టిన ఈ పోస్ట్ కు తన భర్త రణ్బీర్ స్పందిస్తూ.. నా మనసు ప్రేమతో నిండిపోయింది అంటూ రాసుకొచ్చాడు.