విశాల్ దర్శకత్వంలో విజయ్ మూవీ.. స్వయంగా ప్రకటించిన హీరో

విశాల్ దర్శకత్వంలో విజయ్ మూవీ.. స్వయంగా ప్రకటించిన హీరో

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ(Mark Antony). సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టైం ట్రావెల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకురాలు ఫిదా అవుతున్నారు. దీంతో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు సాలిడ్ హిట్ పడింది. 

ALSO READ: లీకైన గుంటూరు కారం సాంగ్.. షాకైన ఫ్యాన్స్

అయితే ఇటీవల మార్క్ ఆంటోనీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరో విశాల్. ముందు నుండి విశాల్ తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు విశాల్. తాజాగా ఇదే విషయంపై ఓపెన్ అయ్యాడు విశాల్. తన దర్శకత్వంలో తలపతి  విజయ్ హీరోగా ఒక సినిమా చేయాలనేది తన డ్రీం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ న్యూస్ తెలుసుకున్న ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఈ సినిమా గనుక ఓకే అయితే మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ పండగే.