రంగా రెడ్డి జిల్లా: ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఓ జేబుదొంగ చేతివాటం చూపించాడు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని ఎస్ ఎన్ సి కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ విభాగం చైర్మన్ ఫయిమ్ ఖురేషి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు పలువురు మైనారిటీ పెద్దలతోపాటు రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారిలో ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలు హాజరయ్యారు.
రాజకీయ నాయకులతో వచ్చి అదే హడావిడీలో ఓ కేటుగాడు దొంగతనాలకు పాల్పడ్డాడు. VIP లతోపాటు స్టేజ్ ఎక్కి నాయకుల జేబులకే కన్నం వేసాడు. 8 ఫోన్లతోపాటు రూ.2 లక్షలు కాజేశాడు. దర్జాగా చోరీలు చేసి జరుకుండుండగా కొంతమంది కార్యకర్తలు చూసి పట్టుకున్నారు. జేబుదొంగకు దేహ శుద్ధి చేసి అతని జేబులో తనిఖీ చేయగా రూ.50 వేలు నగదు గుర్తించారు.
నిందితుడని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.