కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకెళ్లండి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకెళ్లండి:  బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు.   కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ప్రతి ఓటర్ ను కనీసం ఐదు సార్లు కలిసి బీజేపీకి ఓటు వేయించాలని కోరారు. యువ ఓటర్లు, వృద్దులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.  నేతన్నలకు మద్దతుగా  ఏప్రిల్10న సిరిసిల్లలో జరిగే దీక్షను విజయవంతం చేయాలన్నారు సంజయ్.  మే 1నుండి 5 వరకు 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడతామని చెప్పారు సంజయ్.