ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన ఓ విమానం సడెన్‌గా హైవే మీద ట్రాఫిక్ మధ్యలో ల్యాండ్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16న కెనడాలోని క్యూబెక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం పమీపంలో జరిగింది. క్యూబెక్ సిటీలోని హైవే మీద ఉదయం 10:30 గంటల సమయంలో కొన్ని కార్లు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. అదే సమయంలో C-FFEC అనే పేరున్న చిన్న ప్లేన్ పొగ చిమ్ముతూ రోడ్ మీదనే అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ప్లేన్ ల్యాండ్ అయ్యే క్రమంలో దాని వెనుక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోలో విమానం నెమ్మదిగా రోడ్ మీదకు ల్యాండ్ అవుతున్నప్పుడు పక్కనే వెళుతున్న ఏ ఒక్క కారు ను కూడా ఢీకొట్టకుండా , చాలా జాగ్రత్తగా ల్యాండ్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కార్లు నడుపుతున్న వారు కూడా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఆ ప్లేన్ వెంటే తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో అదృష్ట వశాత్తు ఎవరికీ ఎలాంటీ ప్రమాదం జరగలేదు.
? Emergency landing of a small plane ✈ this morning around 10:00 AM, on "Highway 40" just outside of #Montreal, #Quebec, #Canada. pic.twitter.com/WCkk5L5aZ0
— Lauthfee Javier C. Alastair (@Lauthfee) April 16, 2020
