నల్లగొండ జిల్లా : మూగ జీవాలపై విష ప్రయోగం జరిగింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం బచ్చాపురం గ్రామంలో చోటుచేసుకోగా.. దాదాపు పది ఆవులు చనిపోయాయి. తోటలో తరచూ ఆవులు వేత కోసం వస్తున్నాయని ఆ తోట యజమాని నీటి సంపులో విషప్రయోగం చేశాడు. ఎప్పటి లాగే మేతకు వచ్చిన పశువులు విష పదార్థం కలిపిన నీళ్లు తాగాయి. కలుషిత నీరు సేవించిన 11 ఆవులు మృతిచెందాయి. మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.