కేంద్రంపై గిరిజన విద్యార్థుల పోస్టుకార్డు ఉద్యమం

కేంద్రంపై గిరిజన విద్యార్థుల పోస్టుకార్డు ఉద్యమం

హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద గిరిజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోస్టు కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రాజ్యంగా సవరణ చేసి వెంటనే ఆమోదించాలని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన చేనేత కార్మికుల సమస్యలపై ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం నేత శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా వెయ్యి మంది గిరిజన విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 1000 పోస్టుకార్డులను పంపిస్తామన్నారు. రాబోయే రోజుల్లోనూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, రిజర్వేషన్లు కల్పించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.