రేవంత్ ను కట్టేసి కొట్టినా తప్పులేదు: హరీశ్ రావు

రేవంత్ ను కట్టేసి కొట్టినా తప్పులేదు: హరీశ్ రావు
  • కేసీఆర్​ లేకుంటే తెలంగాణ లేదు.. 
  • ఆయనపైనే ఇష్టమున్నట్లు మాట్లాడ్తున్నడు?
  •  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం
  •  సీఎం మాట్లాడిన తీరు అసహ్యంగా ఉంది: శ్రీనివాస్​ గౌడ్
  • రేవంత్​ను దింపిన తర్వాతే.. 
  • కేసీఆర్ ​పులిలా అసెంబ్లీకి వస్తరు: మర్రి జనార్దన్​ రెడ్డి
  •     సీఎం​ మాటలకు పిల్లలు భయపడ్తున్నరు: రసమయి
  •     కొడంగల్​ సభలో సీఎం రేవంత్ ​వ్యాఖ్యలపై
  • బీఆర్​ఎస్​ నేతల విమర్శలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని కట్టేసి కొరడాతో కొట్టినా తప్పులేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ అని, ఆయన లేకుంటే తెలంగాణ లేదని, తండ్రి లాంటి కేసీఆర్​పైనే ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం సిద్దిపేటలోని  అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో స్టూడెంట్స్​కు హరీశ్​రావు బ్లాంకెట్స్  పంపిణీ చేశారు. స్టూడెంట్లకు పెట్టే గుడ్లు, బియ్యాన్ని పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్ రెడ్డి వీధి రౌడీలాగా మాట్లాడుతున్నడు. మళ్లీ గెలుస్తామని శపథాలు చేస్తున్నడు.  కమీషన్లు కొట్టుడు.. చిల్లర మాటలు మాట్లాడుడు.. పార్టీలు మారుడు.. సీట్లు కొనుడు రేవంత్​కు అలవాటే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఆయనకు అనాథ పిల్లలకు అన్నం పెట్టుడు కూడా చేతనైతలేదు. అలాంటి వ్యక్తిని చెట్టుకు కట్టేసి తొండలు జొర్రిచ్చి కొరడాతో కొట్టినా తప్పులేదు” అని ఫైర్​ అయ్యారు.  అనాథ పిల్లలకు అన్నం పెట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని.. విద్యా శాఖను కూడా స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్న ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 5 నెలల నుంచి స్టూడెంట్లకు కాస్మోటిక్ చార్జీలు, మెస్ బిల్లులు రావడం లేదని తెలిపారు. ‘‘స్టూడెంట్లకు గ్రీన్ చానెల్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. 20 శాతం కమీషన్ ఇచ్చేవాళ్లకు మాత్రం డబ్బులు విడుదల చేస్తున్నరు. కమీషన్ రాని వాటికి డబ్బులు ఇవ్వడం లేదు. రేవంత్​రెడ్డి చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి” అని హరీశ్​ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నేతలు రాజనర్సు, కనకరాజు, పాల సాయిరాం, నిమ్మ రజనీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.