రేషన్ డీలర్లకు ఆరోగ్య బీమా కల్పించాలె

రేషన్ డీలర్లకు ఆరోగ్య బీమా కల్పించాలె

న్యూఢిల్లీ: అల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాల నుంచి రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, బడుగు లింగయ్య యాదవ్ రేషన్ డీలర్ల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ... ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనన కమీషన్ ఉందన్న ఆయన... దేశ వ్యాప్తంగా వన్ నేషన్.. వన్ రేషన్... వన్ కమీషన్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. 

కోవిడ్ సమయంలో రేషన్ డీలర్లు చాలా రిస్క్ తీసుకున్నారని, ఈ క్రమంలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 97మంది డీలర్లు మృతి చెందారని తెలిపారు. రేషన్ డీలర్ల కార్పొరేషన్ లో వందల కోట్ల నిధులు మూలుగుతున్నాయన్న ఆయన... బాధిత కుటుంబాలకు అన్ని విధాల సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నాలుగు వందల రూపాయలకే క్వింటాల్ బియ్యం ఇవ్వాలన్న ఆయన... నిత్యావసర సరుకుల సంఖ్యను కూడా పెంచాలని కోరారు. రేషన్ డీలర్లకు ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.