ప్రేమ వ్యవహారంలో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ మధ్య గొడవ.. డిగ్రీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి

ప్రేమ వ్యవహారంలో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ మధ్య గొడవ.. డిగ్రీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి
  •     ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో డిగ్రీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి

పాల్వంచ రూరల్, వెలుగు : ప్రేమ వ్యవహారంలో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ మధ్య తలెత్తిన గొడవ ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాణం తీసింది. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్‌‌‌‌‌‌‌‌లో శనివారం జరిగింది. పాల్వంచ మండలంలోని యానాంబైలు గ్రామానికి చెందిన అల్లూరి విష్ణు (22) బసవతారక కాలనీలోని కాలేజీలో డిగ్రీ సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు. శనివారం సాయంత్రం సుమారు 20 మంది స్టూడెంట్లు పార్టీ చేసుకోగా అక్కడికి విష్ణు సైతం వెళ్లాడు. 

పార్టీ కొనసాగుతుండగా ఓ విద్యార్థికి సంబంధించిన ప్రేమ వ్యవహారంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో విష్ణు తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో మిగతా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ అతడిని పాల్వంచలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు విష్ణు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న సీఐ వినయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రూరల్‌‌‌‌‌‌‌‌ ఎస్సై శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని దాడికి సంబంధించిన వివరాలను స్టూడెంట్లను అడిగి 
తెలుసుకున్నారు.