మెక్డొనాల్డ్స్లో పిల్లాడిని కరిచిన ఎలుక

మెక్డొనాల్డ్స్లో పిల్లాడిని కరిచిన ఎలుక

హైదరాబాద్ కొంపల్లి మెక్ డొనాల్డ్స్ లో 8 ఏళ్ల బాలుడ్ని ఎలుక కరిచిన ఘటన కలకలం రేపింది. మార్చి 8న జరిగిన ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలుక దాడి చేసిన అనంతరం తల్లిదండ్రులు ఆ బాలుడ్ని బోయిన్ పల్లి హాస్పిటల్ కి తరలించి టెటానస్, యాంటీ రేబిస్ డోస్ ఇంజిక్షన్లు ఇప్పించారు.

మార్చి 8న మెక్ డొనాల్డ్స్ కు వచ్చిన ఫ్యామిలీ పై ఎలుక దాడి చేసింది. ఆ హోటల్ బాత్ రూమ్ నుంచి దూసుకొచ్చిన ఎలుక బాలుడిపైకి ఎక్కి కరిచింది. ఈ ఘటన అంతా రెస్టారెంట్ సీసీ టీవీలో రికార్డు అయింది. ఆ బాలుడి తండ్రి (ఆర్మీ ఆఫీసర్) రెస్టారెంట్ యాజమాన్యంపై కొంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. క్లీన్, హైజీన్ మెయింటెనెన్స్ విషయంలో రెస్టారెంట్ ఫెయిల్ అయిందని, ఘటన జరిగిన తర్వాత కూడా రెస్టారెంట్ యాజమాన్యం ఏమీ స్పందించలేదని ఆరోపించారు. రెస్టారెంట్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.