ఒక రోజు ఏడు ర్యాకుల బొగ్గు రవాణాతో రికార్డు

ఒక రోజు ఏడు ర్యాకుల బొగ్గు రవాణాతో రికార్డు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ సింగరేణి సీహెచ్​పీ(కోల్​ హ్యాండ్లింగ్​ప్లాంట్) ఒక రోజు అత్యధికంగా ఏడు ర్యాకుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. శనివారం ఏడు రేకుల (1 రేకు​ అంటే 4 వేల టన్నుల బొగ్గు లోడు కలిగిన గూడ్స్ రైలు) ద్వారా 28వేల టన్నుల బొగ్గు రవాణా చేసి 47ఏండ్ల సీహెచ్​పీ చరిత్రలో అత్యధిక రవాణాగా రికార్డు సాధించింది.

మరోవైపు 2023-–24 ఆర్థిక సంవత్సరం సీహెచ్​పీకి నిర్దేశిత బొగ్గు రవాణా టార్గెట్​22 లక్షల టన్నులకు గానూ.. ఏకంగా 31 లక్షల టన్నుల రవాణా చేసింది. అత్యధిక బొగ్గు రవాణా చేయడానికి కృషి చేసిన సీహెచ్​పీ ఇన్​చార్జి బాలాజీ భగవతి ఝూ, ఇంజనీర్లు చంద్రమౌళి, అశోక్​రెడ్డి, సంతోశ్​, ఉద్యోగులు, కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్, ఏరియా ఇంజనీర్​ నాగరాజ్​ఆదివారం అభినందించారు.