
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని ట్రాఫిక్సమస్యపై సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్కంట్రోల్సెంటర్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్,హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సిటీ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ -అవినాశ్మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబుతోపాటు ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల టైంలో వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ట్రాఫిక్డైవర్షన్స్, రోడ్లపై వాటర్ లాగింగ్స్ వద్ద సిబ్బంది ఏర్పాటు, ఇంజనీరింగ్ పనులపై చర్చించారు. వానలకు కరాబ్అయిన రోడ్లపై చేపట్టాల్సిన తక్షణ చర్యలను వివరించారు. వాటర్ లాగింగ్స్ ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల రద్ధీ ఎక్కువగా ఉండే జంక్షన్స్ వద్ద నీరు నిలువకుండా చర్యలపై చర్చించారు. వాతావరణానికి సంబంధించిన నోటిఫికేషన్లను, ట్రాఫిక్ సలహాలను ఎప్పటికప్పుడు టీవీ చానెల్స్, పత్రికలలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.