మెహిదీపట్నం, వెలుగు: ఓ రౌడీషీటర్ తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఆసిఫ్ నగర్ మురాద్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్(26), నాంపల్లి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ షేక్ ఉస్మాన్ స్నేహితులు. కొంతకాలంగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం రౌడీ షీటర్ ఉస్మాన్ రాజీ కోసం ఇమ్రాన్ ను గుడిమల్కాపూర్ పిల్లర్ నంబర్ 54 వద్దకు రమ్మన్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఉస్మాన్ కత్తితో ఇమ్రాన్ పై దాడి చేశాడు. ఇమ్రాన్ ముఖంపై కాట్లు పడ్డాయి. స్థానికులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఉస్మాన్ పై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 30 కేసులు నమోదైనట్లు సీఐ రాజు తెలిపారు.

