ఆదిపురుష్ ఈవెంట్ లో తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

ఆదిపురుష్ ఈవెంట్ లో తోపులాట.. పోలీసుల లాఠీఛార్జ్

తిరుపతి తారకరామ స్టేడియంలో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. కిక్కిరిసిపోయిన అభిమానులతో ప్రాంగణం చాలా రద్దీగా ఉంది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. తారకరామ స్టేడియం గేట్ 1 దగ్గర తోపులాట జరడంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో అభిమానులు పరుగులు తీశారు. 

ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ప్రభాస్ (Prabhas) కటౌట్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈవెంట్ జరగనున్న గ్రౌండ్లో 100 అడుగుల(100 feet) ప్రభాస్ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. ప్రభాస్ కు పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ జై శ్రీరామ్, జై శ్రీరామ్(Jai Shreeram) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రిలీజ్ కు ముందే ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.