సిద్దిపేటలో రాష్ట్ర కూటుల  కాలం నాటి శిల్పం

సిద్దిపేటలో రాష్ట్ర కూటుల  కాలం నాటి శిల్పం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కూటుల కాలం నాటి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సలాక్​పూర్ పాటిగడ్డ మీద బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, ఎన్.కిరణ్ దీనిని గుర్తించారు. నల్ల రాతితో చెక్కిన ఈ వీరుని శిల్పం అర్థ పద్మాసన స్థితిలో కూర్చున్నట్లుగా ఉంది. ఈ శిల్పానికి కొద్ది దూరంలో గుర్రం సగం శిల్పం ఉంది. దాని వీపున ఉన్న జీనుకు కుడివైపున ఒరలో పట్టా కత్తి కనిపిస్తున్నది. వీరుడు ఆ గుర్రాన్ని నిలిపిన చోటుకు దూరంగా ఆత్మార్పణ చేసుకోవడానికి ముందు ఇష్ట దైవ ప్రార్థనకు కూర్చున్నట్లున్నగా ఉంది. శిల్ప శైలిని బట్టి ఇది రాష్ట్ర కూటుల కాలంనాటిదని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నిర్ధారించారు. ఒకప్పుడు శైవంలో పుట్టుకొచ్చిన ఆత్మార్పణ సంస్కృతిలో‌‌ ఇది భాగమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌‌ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.