ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో  13,75,029 క్యుసెక్కులు

రాజమండ్రి:  గోదావరి నదిలో వరద  ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధికారులు వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులు దాటడంతో ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో  13,75,029 క్యుసెక్కులు గా నమోదైంది.

వరద వల్ల గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా అత్యవసర  పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు. ధవళేశ్వరం చుట్టుపక్కల ప్రాంరతాల్లో ఏపీ విపత్తుల శాఖ సహాయక బృందాలను రంగంలోకి దించింది. అనేక గ్రామాల్లోకి వరద చొచ్చుకుని రావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల్లోని అధికారులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స కోసం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.