ఘట్ కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ లో నేతల మధ్య వర్గపోరు

ఘట్ కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ లో నేతల మధ్య వర్గపోరు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంది. రెండు వర్గాల నాయకులు కొట్టుకున్నారు. ఇదంతా పోలీసుల ముందే జరిగింది. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలను సముదాయించలేక పోలీసులు అపసోపాలు పడ్డారు. 

అసలేం జరిగిందంటే..? 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఘట్ కేసర్ మున్సిపాలిటీలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రావాల్సి ఉంది. ఈలోపే ఘట్ కేసర్ లోని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెండు వర్గాల వాళ్లు కొట్టుకున్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య, మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 

పోలీసుల ముందే ఒకరిపై మరొకరు చెయ్యి చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గం వాళ్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన సొంత ఖర్చుతో ఫంక్షన్ హాల్ కు జనాలను తీసుకొచ్చానని, అలాంటప్పుడు తాము ఎందుకు గొడవ పెట్టుకుంటామని కౌన్సిలర్ అంజి చెప్పారు. కావాలనే తమపై మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పావని జంగయ్య గొడవకు దిగాడని, పోలీసుల ముందే ఇదంతా జరిగిందని చెప్పాడు.