షోరూమ్ నుంచి ఓనర్ ఇంటికి.. తనకు తానే డెలివరీ చేసుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్

షోరూమ్ నుంచి ఓనర్ ఇంటికి.. తనకు తానే డెలివరీ చేసుకున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్

టెక్సస్: అమెరికాలో ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తన కొత్త యజమానిని వెతుక్కుంటూ ఇంటికి వెళ్లింది. ఫ్యాక్టరీ నుంచి తనకు తానుగా ప్రయాణించి యజమాని వద్దకు చేరుకుంది. టెక్సస్​లోని ఆస్టిన్​లో తనను తానే డెలివరీ చేసుకుంది. 

ప్రపంచంలోనే తొలిసారిగా సెల్ఫ్ డెలివరీ చేసుకున్న వాహనంగా టెస్లా కంపెనీ కొత్త మోడల్ ​వై రికార్డులకెక్కింది. గిగా ఫ్యాక్టరీ నుంచి కారు బయలుదేరిన టెస్లా కారు.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, లేన్ లు మారుతూ, రోడ్లు దాటుతూ, మలుపులు తిరుగుతూ ప్రయాణించింది. 

ట్రాఫిక్ ను అంచనా వేస్తూ, మిగతా వాహనాలను గమనిస్తూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంది. ఓ దశలో కారు గంటకు 110 కి.మీ.వేగంతో ప్రయాణించిందని టెస్లా నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రయాణం సందర్భంగా కారు వెనక సీటులో ఓ ఉద్యోగి కూర్చుని వీడియో తీశారు. 

ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ ఇంటికి చేరేంత వరకూ 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను 3 నిమిషాలకు కుదించి టెస్లా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్​గా మారింది.