
జగిత్యాల జిల్లా నల్లగొండ శివారులో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక పాము బీర్ టిన్ లో ఇరుక్కొని బయటకు రాలేక తల్లడిల్లిపోయింది. నల్లగొండ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరేందుకు ప్రయత్నించి ఇరుక్కుపోయింది పాము. తల ఇరుక్కుపోయి బయటికి రాలేక మూడు గంటలపాటు నరకం చూసింది పాము.
బీర్ టిన్నులో ఇరుక్కున్న పాము.. మూడు గంటలపాటు నరకం చూసింది pic.twitter.com/rNepNYnm99
— MANOHAR (@MaNi_ChiNna_) August 16, 2024
పామును బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు చాలా సేపటికి డబ్బాతో సహా వెళ్తూ ముళ్లకంపకు తట్టుకుని ఊడిపోవడంతో బతుకుజీవుడా అంటూ పొదల్లోకి దూరిపోయింది పాము.ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.