కారు టైరు  కింద పాము.. రక్షించిన పోలీసులు 

కారు టైరు  కింద పాము.. రక్షించిన పోలీసులు 

హైదరాబాద్ కేపీహెచ్ బీ రోడ్డు వాహనాలతో నిత్యం యమ రద్దీగా ఉంటుంది. రయ్..రయ్ మంటూ బైక్ లు, కార్లు దూసుకుపోతాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదులు కోవాల్సిందే. ట్రాఫిక్స్ సిగ్నల్స్ ఉన్నా కూడా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి రోడ్డుపై స్పీడ్ గా వెళ్తున్న కారు టైర్ కింద పాము పడింది. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో దానికి ఎలాంటి దానికి పెను ప్రమాదం తప్పింది.

కారు టైరు కింద పడిన పాము ఎంతకు వెళ్లకపోవడంతో అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి స్నేక్ స్నాచర్ కు సమాచారం అందించారు. వారు ఎంతో చాకచక్యంగా బకెట్ సాయంతో కారు టైరు కింద ఉన్న పామును పట్టుకున్నారు. వీరికి స్థానికులు కూడా సాయం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.