
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మించిన చిత్రం ‘అథర్వ’. శనివారం ఈ చిత్రం నుండి ‘కేసీపీడీ’ అనే పాటను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసి, పాడిన ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ రాశాడు. ‘కేసీపీడీ.. కేసీపీడీ.. కంటి చూపే పడ్డాదంటే దంచేస్తాడే’ అంటూ సాగిన ఈ పాటను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించగా.. హీరో కార్తీక్ రాజు మాస్ గెటప్‌లో కనిపించాడు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.