సలార్ నుంచి.. సూరీడే గొడుగుపట్టి వచ్చాడే సాంగ్ రిలీజ్..

సలార్ నుంచి..  సూరీడే గొడుగుపట్టి వచ్చాడే సాంగ్ రిలీజ్..

ప్రభాస్‌‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌‌‌‌’. పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటిస్తున్నాడు.  ఇప్పటికే ట్రైలర్‌‌‌‌లో ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇక వీళ్లిద్దరి ఫ్రెండ్‌‌ షిప్‌‌ ఎంత బలమైనదో తెలియజేస్తూ బుధవారం ‘సూరీడే గొడుగుపట్టి వచ్చాడే భుజము తట్టి.. చిమ్మచీకటి లోను నీడల ఉండెటోడు’ అనే పాటను విడుదల చేశారు.

రవి బస్రూర్ కంపోజ్ చేసిన ఈ పాటను హరిణి వైటూరి పాడారు.  ‘ఖడ్గమొకడైతే, కలహాలు ఒకడివిలే.. ఒకడు ఘర్జన, ఒకడు ఉప్పెన, వెరసి ప్రళయాలే... సైగ ఒకడు, సైన్యం ఒకడు, కలిసి కదిలితే కదనమే.. వేగం ఒకడు, త్యాగం ఒకడు, గతము మరువని గమనమే.. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే..’ అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఇద్దరు హీరోల క్యారెక్టర్స్‌‌ను హైలైట్ చేస్తూ, వాళ్ల మధ్య గల స్నేహాన్ని తెలియజేస్తున్నాయి.

ఇక ప్రభాస్‌‌ సరసన శ్రుతిహాసన్‌‌ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీరావు, టీనూ ఆనంద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న విడుదల కానుంది.