ఒడిస్సీ డాన్స్ తో అదరగొట్టిన కొరియన్ మహిళ

ఒడిస్సీ డాన్స్ తో అదరగొట్టిన కొరియన్ మహిళ

సౌత్ కొరియా: ఒడిస్సీ డాన్స్ తో ఓ సౌత్ కొరియన్ మహిళ అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే సౌత్ కొరియాకు చెందిన బీనా క్యూమ్ కొన్నేళ్లుగా భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఓ ఫంక్షన్ లో చేసిన ఒడిస్సీ నృత్యం ప్రతి ఒక్కరినీ అలరించింది. కొరియన్ సాంగ్ కు ఇండియన్ క్లాసికల్ బీట్ మిక్స్ చేసిన పాటకు లయబద్ధంగా ఆమె చేసిన నృత్యం చూపరులను కట్టిపడేసింది.

కట్టు, బొట్టు, అభినయం తీరుతో భారతీయతను ప్రదర్శించింది. ఇకపోతే... ఓ ఇండియన్ సినిమా చూసి ఒడిస్సీ డాన్స్ పై ఇష్టం పెరిగిందని, ఈ క్రమంలోనే ఇండియాకు వెళ్లి డాన్స్ నేర్చుకున్నానని బీనా క్యూమ్ తెలిపింది.