ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే స్పెషల్ 'చక్కెర కేళి మిల్క్‌షేక్'.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే స్పెషల్ 'చక్కెర కేళి మిల్క్‌షేక్'.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

సాధారణంగా అరటిపండు జ్యూస్ అంటే అందరూ చేసుకుంటారు, కానీ 'చక్కెర కేళి' పండ్లతో చేసే జ్యూస్ రుచే వేరు! ముఖ్యంగా ఎండలు మండిపోయే ఈ వేసవిలో, బయట దొరికే ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్‌ కంటే ఇంట్లోనే ఎంతో హెల్తీగా, చిక్కగా చేసుకునే 'చక్కెర కేళి మిల్క్‌షేక్' అద్భుతంగా ఉంటుంది. పాలు, జీడిపప్పు, హార్లిక్స్ కాంబినేషన్‌తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ టేస్టీ జ్యూస్‌ను కేవలం ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా...

కావాల్సినవి
చక్కెర కేళి అరటిపండ్లు- మూడు 
పాలు(కాచినవి)- అరకప్పు 
చక్కెర- ఎనభై గ్రాములు, 
పాలు- అర లీటరు 
జీడిపప్పు పలుకులు- రెండు టేబుల్ స్పూన్లు 
హార్లిక్స్- ఒక టీ స్పూన్

ALSO READ : వృశ్చిక రాశిలో 'బ్లూ మూన్'

తయారీ
పచ్చి పాలు ఫ్రీజ్లో పెట్టి గడ్డ కట్టించాలి..కాచిన పాలను చల్లార్చి, ఫ్రిజ్లో పెట్టాలి. పండిన చక్కెర కేళీలను మధ్యకు కట్ చేసి మిక్సీ జార్ లోకి తీయాలి. అందులో ఫ్రిజ్లో పెట్టిన పాలను పోయాలి. చక్కెర కూడా వేసి హైస్పీడ్ మిక్సీ పట్టాలి. ఆ తర్వాత పాల గడ్డలు వేసి హైస్పీడ్ మరో 45 సెకన్లు మిక్సీ పట్టాలి. సర్వింగ్ గ్లాసు అడుగున కొన్ని జీడిపప్పు పలుకులు వేసి జ్యూస్ పోయాలి. పైనుంచి హార్లిక్స్, జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్.