హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఆపరేషన్ రోప్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే 100 రూపాయలు ఫైన్ వేయనున్నారు. ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేస్తే ఏకంగా వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నారు. ఫుట్ పాత్ లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా వేయనున్నారు.

పాదచారులకు ఆటంకం కలిగించేలా పార్కింగ్ చేస్తే 600 రూపాయలు ఫైన్ వేయనున్నారు. నో పార్కింగ్ ప్లేస్ లో వెహికిల్స్ పార్క్ చేస్తే టోవింగ్ వెహికిల్ ద్వారా పీఎస్ లకు తీసుకెళ్లనున్నారు. బైక్ నో పార్కింగ్ ఫైన్ 100 రూపాయలతో పాటు అదనంగా టోవింగ్ ఛార్జీ 200 రూపాయలు వసూల్ చేయనున్నారు. కారు నో పార్కింగ్ ఫైన్ 200 రూపాయలతో పాటు అదనంగా టోవింగ్ ఛార్జీ 600 రూపాయలు ఫైన్ వేయనున్నారు.