స్పూఫ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. కమెడియన్ సత్య ఇరగతీశాడు

స్పూఫ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. కమెడియన్ సత్య ఇరగతీశాడు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రంగబలి(Rangabali) సినిమా ప్రమోషన్స్ కోసం కమెడియన్ సత్య(Comedian Sathya) చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూ ప్రోమోనే కనిపించింది. ఈ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి.. ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు ప్రేక్షకులు. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు మేకర్స్. 

తెలుగులో ఉన్న ప్రముఖ ఇంటర్వ్యూవర్స్ ను ఇమిటేట్ చేస్తూ కెమెడియన్ సత్య చేసిన ఈ స్పూఫ్ ఇంటర్వ్యూ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇంటర్వ్యూ విత్ దేవీప్రియా అంటూ ఇద్దరు యాంకర్లను ఇమిటేట్ చేశారు సత్య, ఈ ఇద్దరు యాంకర్లను యాజిటీజ్ దింపేశాడు కమెడియన్ సత్య. అయితే ప్రోమోలో మాత్రం మరో ఇద్దరు యాంకర్లను కూడా ఇమిటేట్ చేసినట్టు చూపించారు. పార్ట్ 2గా రానున్న ఆ విడియోను రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 

ఇక రంగబలి సినిమా విషయానికి వస్తే.. నాగ శౌర్య(Naga shourya) హీరోగా చేసిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త డైరెక్టర్ పవన్ బసంశెట్టి(Pawan Basamsetty) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. యుక్తి తరేజా(Yukti thareja) హీరోయిన్ గా నటిస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ శౌర్య ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి రంగబలి సినిమా నాగ శౌర్యకు హిట్ ఇస్తుందా అనేది తెలియాలంటే.. జైలు 7వ తేదీ వరకు ఆగాల్సిందే.