మెడిటేషన్​ ఇష్టంలేక గోడదూకి పారిపోతుండగా.. స్టూడెంట్​కు కరెంట్​ షాక్​

మెడిటేషన్​ ఇష్టంలేక గోడదూకి పారిపోతుండగా.. స్టూడెంట్​కు కరెంట్​ షాక్​

కొత్తకోట,  వెలుగు:   వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో మెడిటేషన్  చేయడం ఇష్టం లేక మంగళవారం  గోడను దూకి పారిపోవడానికి ప్రయత్నించిన విద్యార్థికి  కరెంట్​ షాక్ తో  తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపల్​ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం బడి గంటకు ముందే రామకృష్ణ అనే టీచర్​ స్టూడెంట్లతో మెడిటేషన్ చేయిస్తారు. 8వ తరగతి చదువుతున్న యుగంధర్ అనే స్టూడెంట్​ మెడిటేషన్ చేయడం ఇష్టం లేక గోడ దూకి స్కూల్ నుంచి బయటకు పారిపోవాలనుకున్నాడు. 

స్కూల్ కాంపౌండ్  అవతలకు పుస్తకాల బ్యాగ్ విసిరివేసి  గోడ దూకేందుకు ప్రయత్నించాడు.  గోడ దూకేటప్పుడు  ఎర్త్ వైర్ మీద పడ్డాడు.  ఎర్త్  వైర్ ట్రాన్స్​ఫార్మర్​కు తగలడంతో పెద్ద శబ్దంతో  యుగంధర్​కు షాక్ తగిలింది.  వెంటనే పొగలు వచ్చి ఫ్యూజులు ఎగిరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  యుగంధర్​ను  వనపర్తి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు.