
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం పరీక్ష చేస్తోంది. బ్యారేజ్ లో జియోఫిజికల్, జియోటెక్నికల్ ,జియో రాడర్ యంత్రం ద్వార పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వార పరీక్షలు నిర్వహిస్తున్నారు నిపుణులు. బ్యారేజ్ లో సీపేజి లీకేజిల మరమ్మత్తులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బ్యారేజ్ లో 34,35 పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు నిపుణులు.సిడబ్ల్యూపిఆర్ఎస్ నిర్వహిస్తున్న పరీక్షలను స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నాతాధికారులు పరిశీలిస్తున్నారు.పది రోజుల పాటు బ్యారేజ్ లో పరీక్షలు నిర్వహించనున్న సీడబ్ల్యూపిఆర్ఎస్ బృందం పది రోజుల పాటు బ్యారేజ్ లో పరీక్షలు జరగనున్నాయని సమాచారం.