ఫుడ్​ కోసం 550 కిలోమీటర్లు జర్నీ

ఫుడ్​ కోసం 550 కిలోమీటర్లు జర్నీ

మంచు కురుస్తున్నప్పుడు, వందల కిలోమీటర్లు కార్లో ప్రయాణిస్తే.. అది అడ్వెంచర్​ జర్నీ. కానీ, కేవలం సరుకులు తెచ్చుకోవడానికే రెండు రోజులు జర్నీ చేయాల్సి వస్తే! అలాంటి జర్నీనే చేసింది కెనడాకి చెందిన టిక్​టాకర్​. ఆమె పేరు షినీడ్​ మీడర్. ఆమె న్యూట్రిషన్​ కోచ్​. తను చేసిన రెండు రోజుల జర్నీని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. అది వైరల్​ అవుతోంది.

కెనడాలో మంచు కొండల మధ్య ఉంటుంది యుకాన్​. మారుమూలగా ఉండే ఈ గ్రామంలో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. షినీడ్​ మీడర్​ది​ అదే ఊరు. యుకాన్​లో కిరాణా షాపులు ఉన్నాయి. కానీ, వాటిలో వంటసామాన్లు దొరకవు. అవి తెచ్చుకోవాలంటే సుమారు 550 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిందే. ఆ దార్లో జర్నీ చేయడం కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే ఫోన్​ సిగ్నల్స్​ ఉండవు. మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటుంది. వేరే వెహికల్స్​ కూడా కనుచూపుమేరలో కనిపించవు. మరి అంత దూరం వెళ్లి సరుకులు, కూరగాయలు, పాలు తెచ్చుకుంటే అవి వారానికే అయిపోతాయి కదా! ఈ సమస్య లేకుండా ఉండేందుకు మీడర్​ ఒక ప్లాన్​ వేసుకుంది. అదేంటంటే ఫ్రోజెన్​ ఐటమ్స్​ తెచ్చుకోవడం. 
అలా తెచ్చుకునేందుకే మీడర్​ ఓ రోజు రాత్రి ఊరినుంచి బయల్దేరింది.

మంచు రోడ్లలో కారు నడుపుకుంటూ వెళ్లేసరికి రెండు రోజులు  పట్టింది. స్టోర్​కి వెళ్లాక 30 వేల రూపాయల విలువచేసే పప్పులను, కూరగాయలను, పాలను కొనుక్కుంది. పాలు, చపాతీలు, కూరగాయలు, పచ్చళ్లు, పండ్లు అన్నీ ఫ్రోజెన్​వేనట. అవి ఆర్నెళ్ల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెబుతుందామె. మీడర్​ న్యూట్రిషనిస్ట్​ కూడా. అందుకే కాబోలు ఈ ఫ్రోజెన్​ ఫుడ్​ తినడం వల్ల నష్టమేమీ ఉండదని చెబుతుందామె.

ఈ మొత్తం లైఫ్​ స్టయిల్​ను ‘ఐసోలేటెడ్​ టౌన్​’ పేరుతో యూట్యూబ్​, టిక్​టాకల్లో షేర్​​ చేసింది.  మీడర్​ టిక్​టాక్​లో, యూట్యూబ్​లో పోషకాహారానికి సంబంధించిన  టిప్స్​ చెబుతుంటుంది. ఫాలోవర్ల ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తుంది. ఈ వీడియోను రీసెంట్​గా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో వైరల్​ అవుతోంది. ఫ్రోజెన్​ ఫుడ్​, అందులోని వెరైటీల గురించి ఈ వీడియో ద్వారా  తెలుసుకోవచ్చు. ఫుడ్​కి సంబంధించి సలహాలు ఇచ్చే ఈ కోచ్​ తన పర్సనల్​ లైఫ్​ ఎక్స్​పీరియెన్స్​ చెప్పడంతో ఈ వీడియోకు క్రేజ్​ పెరిగింది.