ముదిగొండ మండలంలో బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌.. ఇద్దరు చిన్నారులు మృతి..మరొకరికి గాయాలు

 ముదిగొండ మండలంలో బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌.. ఇద్దరు చిన్నారులు మృతి..మరొకరికి గాయాలు
  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఘటన

ముదిగొండ, వెలుగు : బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దమండవ గ్రామానికి చెందిన గొర్రెముచ్చు యోహాను కొడుకు సాయి, కూతురు సనా (10), బుచ్చిబాబు కుమారుడు పేరం ప్రవీణ్(13) కలిసి బైక్‌పై ఖమ్మం వెళ్తున్నారు.

 గ్రామ శివారులోకి చేరుకోగానే ఖమ్మం నుంచి వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్‌ అక్కడికక్కడే చనిపోగా, మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరినీ 108లో హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో సనా చనిపోగా, సాయి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. కాగా, బాణాపురం గ్రామానికి చెందిన రైతు మామిడి చెట్లను నరికించి, ఆ మొద్దులను రోడ్డు పక్కనే వేయడంతో వాటిని తప్పించబోయిన ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.