బెంగళూరు పొడి ఇడ్లీపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

బెంగళూరు పొడి ఇడ్లీపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

మీరు ఎప్పుడైనా బెంగుళూరుకు వెళ్లి ఉంటే..అక్కడ దొరికే ఎంతో పేరున్న ‘పొడి ఇడ్లీ’ రుచి చూశారా..? ఒకవేళ పొడి ఇడ్లీని తిని ఉంటే ఆ రుచి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలో కాసింత నెయ్యి వేసుకుని తింటుంటే ఆ మజానే వేరబ్బా..! అని అంటుంటారు ఆ ఇడ్లీ రుచిన చూసిన వాళ్లు.. 

బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన పొడి ఇడ్లీని రుచి చూసిన ‘అంకిత్ టుడే’ అనే ట్విట్టర్ వినియోగదారుడు.. ఈ వంటకంపై విమర్శలు చేశాడు.  బెంగళూరులోని చాలా ఫేమస్ ప్రాంతాల్లో దొరికే పొడి ఇడ్లీపై నెయ్యి వేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని, దీన్ని తాను సహించనని చెప్పాడు. అధిక మోతాదులో వడ్డించే నెయ్యి వల్ల మనిషి శరీరంలో కొవ్వు పెరుకుపోతుందని, దాని వల్ల పొడి ఇడ్లీ తినడం మానేశానని తన ఓపియన్ ను షేర్ చేశాడు. 

https://twitter.com/ankitv/status/1662278183683760129

అంతేకాదు.. స్పైసీ వాటి కంటే హాట్, ఫ్రెష్ ఇడ్లీలను ఎలా ఇష్టపడుతాడో కూడా ట్విట్టర్ లో వెల్లడించాడు అంకిత్ టుడే. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ తెలియజేస్తున్నారు. అంకిత్ టుడే చేసిన ట్విట్ ఇప్పటికే 77K వ్యూస్ దాటింది. 

https://twitter.com/Koushik_laribee/status/1662617217425620992

ఈ ట్విట్ నెట్టింట్లో భోజనప్రియుల (పుడ్ లవర్స్) మధ్య చర్చకు తెరలేపింది. " అంకిత్ టుడే ట్విట్ తో నేను పూర్తిగా అంగీకరించాను. ఆ ఫుడ్ తినడం కంటే ఇసుక తినాలనిపిస్తుంది. పొడి ఇడ్లీని తినేందుకు కస్టమర్స్ బారులు తీరడం చూసి నేను జాలీ పడుతున్నాను" అంటూ ఒక ట్విటర్ వినియోగదారుడు పేర్కొన్నాడు.

https://twitter.com/rabbdimehr/status/1662559399330852864

మరొక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ‘‘ పొడి ఇడ్లీని అప్పుడప్పుడు మాత్రమే తినవచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. మొత్తంగా పొడి ఇడ్లీపై అంకిత్ టుడే చేసిన ట్విట్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది.