రెండు నెలలకు ఒక వెకేషన్.. మీ జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో తెలుసా!

రెండు నెలలకు ఒక వెకేషన్.. మీ జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో తెలుసా!

ప్రజెంట్ ట్రెండ్ లో వర్క్ కల్చర్ ఎలా ఉంది.. అంతా ఫాస్ట్ ఫేస్డ్ వర్క్.. క్విక్ రెస్పాన్స్.. క్విక్ రిజల్ట్స్.. క్విక్ లెర్నింగ్.. క్విక్ ఔట్ పుట్.. ఇలా క్విక్.. క్విక్.. అనుకుంటూ ప్రొఫెషన్ ను.. పర్సనల్ లైఫ్ ను మేనేజ్ చేయలేక చాలా మంది జీవితంలో కిక్కు దొబ్బిందిరా మామా.. అనే పరిస్థితి. దీంతో స్ట్రెస్, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ కలహాలు. వీటన్నింటి నుంచి బయటపడేందుకు కనీసం రెండు నెలలకు ఒక ట్రిప్ తప్పనిసరి అంటున్నారు పరిశోధకులు. ఇవే కాదు.. ప్రొడక్టివిటీ పెరగటంతో పాటు వెకేషన్ ద్వారా జరిగే మార్పుల గురించి ఆలోచిస్తే.. మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా అనిపించక మానదు అవేంటో తెలుసుకుందాం.

Maximising Recovery: The Superiority of Frequent Vacations for Well-Being and Performance అనే పేరుతో వచ్చిన ఒక స్టడీ వెల్లడించిన అంశాలు చాలా యాప్ట్ గా అనిపించాయి. ఎంత హై ప్రొఫైల్ లైఫ్ కు అయినా.. మధ్య మధ్యలో వెకేషన్ తో చాలా మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. 


అప్పుడప్పుడు తీసుకునే బ్రేక్స్..

ఈ స్టడీ ప్రకారం.. నిరంతర పని ఒత్తిళ్లు క్రమంగా శారీరకంగా, మానసికంగా క్షీణింపజేస్తాయి. ఇది కార్టిసాల్ స్థాయిలు పెరగడం, మానసిక అలసట, ఎమోషనల్ గా నిస్పృహకు గురికావడానికి దారితీస్తుంది.  రాను రాను విశ్రాంతి లేకపోవడం బర్న్‌అవుట్ ప్రమాదాన్ని పెంచుటమే కాకుండా ప్రొడక్టివిటీ తగ్గించి.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మధ్యమధ్యలో తీసుకునే వీటి నుంచి బయటపడేందుకు దోహదపడతాయి.  

ప్రతి 2 నెలలకు ఒకసారి చిన్న విహారయాత్ర..

 ఒకేసారి ఎక్కువ కాలం విరామం తీసుకోవడం కంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి చిన్న చిన్న సెలవులు తీసుకోవాలని స్టడీ సూచిస్తుంది. ఇలా చేస్తే ఒత్తిడి పెరగకుండా నిరోధించి, ఏడాది రికవర్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. 

హాలిడే రోజు పని చేయవద్దు:

హాలిడే  సమయంలో పనిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.  ఇమెయిల్‌లు, కాల్స్,  వర్క్ కమ్యూనికేషన్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదని చెబుతున్నారు. 

వెకేషన్ వల్ల లాభాలు:

సెలవులు అలసటను క్రమంగా తగ్గిస్తాయని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని, లైఫ్ లో సంతృప్తిని పెంచుతాయని కనుగొన్నారు.
తక్కువ కార్టిసాల్ స్థాయిలు, మంచి హార్ట్ బీట్,  మంచి నిద్ర,  శారీరక ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 
ఫ్రిట్జ్, సోనెన్‌టాగ్ పరిశోధన ప్రకారం, సెలవుల్లో పని గురించి ఆలోచించకుండా  విరామం తీసుకున్న వాళ్లు తిరిగి వచ్చిన తర్వాత పర్ఫామెన్స్ పెరిగినట్లు వెల్లడైంది.

మీ ప్రయాణంలో ఏం చేయాలి

వెకేషన్ వెళ్లే వారు  జర్నీలో ఏం చేయాలో కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. శారీరక వ్యాయామం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం, కల్చరల్ గా అందుబాటులో ఉన్న కార్యక్రమాల్లో లేదా పనుల్లో పాల్గొనటం.. చాలా మార్పులు తెస్తాయని స్టడీ చెబుతోంది. 

►ALSO READ | ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని, శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచే అద్భుతమైన 6 యోగాసనాలు ఇవే!

ఇతరులతో కలవడం (సోషలైజింగ్) లేదా హాబీస్ లను కొనసాగించడం వంటింవి మనలో మంచి మార్పుకు దోహదం చేస్తాయి. 

ఎక్కవ రోజులు సెలవులతో నష్టమే:

ఎక్కువ రోజుల సెలవుల వలన మంచి జరుగుతుందనేది కూడా అబద్ధమే అంటున్నారు. సెలవుల్లో ఆరోగ్యం, మానసిక స్థితి బాగా అయినప్పటికీ..  సాధారణంగా ఎనిమిదవ రోజు తర్వాత మళ్లీ డౌన్ అవుతుందని చెబుతున్నారు. వారం కంటే ఎక్కవ తీసుకుంటే నష్టాలే తప్ప లాభాలు లేవంటున్నారు.

ఒకేసారి 23 రోజుల సెలవు తీసుకున్న వారికంటే రెండు నెలలకు ఒక నాలుగైదు రోజులు.. మ్యాగ్జిమమ్ వారం రోజులు సెలవు తీసుకున్న వారిలో మంచి ప్రొడక్టివిటీ పెరిగినట్లు స్టడీ చెబుతోంది. 

ఆఫీసుల ప్రోత్సాహం:

తరచుగా సెలవులు తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఆఫీసులు అందుకు ఎంత మేరకు సహకరిస్తాయనేది కూడా చర్చించాల్సిన విషయం. అయితే ఆఫీసులు అందుకు ప్రోత్సహించాలని స్టడీ చెబుతోంది. దీని వలన ప్రొడక్టివిటీ పెరిగి.. ఉద్యోగి నుంచి మంచి ఔట్ పుట్ వస్తుందని చెబుతున్నారు.