పెండ్లి ఇష్టంలేక యువతి సూసైడ్.. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఘటన

పెండ్లి ఇష్టంలేక యువతి సూసైడ్.. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఘటన

​చొప్పదండి, వెలుగు: పెద్దలు కుదిర్చిన పెండ్లి ఇష్టం లేక కరీంనగర్  జిల్లా చొప్పదండి పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన వనపర్తి సంధ్య(27) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతినగర్​కు చెందిన వనపర్తి కనకయ్యకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 

పెద్ద కూతురుతో పాటు కవలల్లో ఒకరికి గతంలో పెండ్లి జరిగింది. సంధ్య కరీంనగర్​లోని ఒక ప్రైవేట్  హాస్పిటల్​లో పని చేస్తుండగా, ఇటీవల పెండ్లి కుదిరింది. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని సంధ్య శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.