ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకిన మహిళ

ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకిన మహిళ

గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో ఘటన 

జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలు నందిని(10), శివాని (4), బుజ్జి (1) తీసుకుని చెరువులోకి దూకింది. స్థానికులు గమనించేలోగానే దారుణం జరిగి పోయింది. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానాలున్నాయి.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.