
జీడిమెట్ల, వెలుగు : పెండ్లి కావడం లేదని బాధతో ఓ యువకుడు సూసైడ్చేసుకున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మెదక్‌జిల్లాకు చెందిన ఎ.విష్ణుప్రసాద్(35) సిటీకి వచ్చి కొంపల్లి పరిధి గాంధీనగర్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పెండ్లి కావట్లేదని బాధపడుతున్నాడు. బుధవారం తల్లి పనికి వెళ్లగా, విష్ణుప్రసాద్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.