
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా యువకుడు సౌతాఫ్రికాలో మరణించాడు. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన కీర్తితేజ (40) కొన్నేండ్ల క్రితం బిజినెస్ కోసం సౌతాఫ్రికాలోని రువాండాకు వెళ్లాడు. గురువారం ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందాడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.