ఘట్ కేసర్, వెలుగు: చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు చనిపోయాడు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. అంబర్ పేట్ కు చెందిన మహ్మద్ గౌస్ పాషా తన భార్య, కొడుకు మహ్మద్ అర్బాజ్ అలీ(20)లో కలిసి బుధవారం అవుషాపూర్ లోని దర్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. అక్కడ మధ్యాహ్నం సేద తీరుతుండగా.. అర్బాజ్ అలీ తన పేరెంట్స్ కు చెప్పకుండా వెళ్లిపోయాడు.
ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో డెడ్ బాడీ తేలినట్టు సమాచారంతో పోలీసులు వెళ్లి డెడ్ బాడీ ని బయటకు తీశారు. అర్బాజ్ అలీగా గుర్తించి అతని తల్లిదండ్రులకు తెలిపారు. డెడ్ బాడీ ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. మృతుడికి చేపలు పట్టే అలవాటు ఉందని, ఫ్రెండ్స్ తో కలిసి తరచూ వెళ్తుంటాడని తల్లిదండ్రులు చెప్పారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.