
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నల్గొండ జిల్లాలో కూడా వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. యదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో మూసీ ఉదృతంగా ప్రవహిస్తోంది.
అయితే ప్రమాదవశాత్తు లక్ష్మిపురానికి చెందిన యువకుడు కాలు జారీ మూసి వాగులో పడి కొట్టుకుపోయాడు. మూసి మధ్యలో చెట్టును పట్టుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నాడు. కాలు జారీ పడిపోయిన యువకుడు అనుకుంట్ల మచ్చగిరి(26 )గా గుర్తించారు. యువకుడిని కాపాడటం కోసం రామన్నపేట పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు . చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గింది.దీంతో మూసీలో గల్లంతైన యువకుని కాపాడేందుకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. యువకుడి కోసం గాలిస్తోంది.