వీడియోలతో బెదిరించి పలుమార్లు అత్యాచారం.. పెళ్లిచేసుకుని...

V6 Velugu Posted on Mar 18, 2021

గుంటూరులో దారుణం జరిగింది. ఓ యువతిని న్యూడ్ వీడియోలు తీసి పలుమార్లు అత్యాచారం చేసి రెండు సార్లు గర్భం తీయించాడు ఓ యువకుడు. అంతేగాకుండా పెళ్లి చేసుకుని  ట్రిపుల్ తలాక్ చెప్పాడు. నిందుతుడిపై చర్యలు తీసుకోవాలని సినీ నటి కరాటే కళ్యాణితో కలిసి  బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. ‘2018లో తిరుపతి ఎస్వీ సంగీత నృత్యా కాలేజీలో చదువుతుండగా..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన తాసీర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఒక రోజు తన స్నేహితుల  ఇంటికి తీసుకెళ్లి మిఠాయిలో మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడు. స్పృహ కోల్పోయిన నన్ను వీడియోలు, ఫోటోలు తీశారు. ఈ విషయంపై నిలదీస్తే మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పటి నుంచి పలు సార్లు లైంగిక దాడి చేశాడు. మైనర్ అయిన  నాకు గర్భం రావడంతో బలవంతంగా ట్యాబ్ లెట్లు ఇచ్చి గర్భం తీయించాడు . తర్వాత  హైదరాబాద్ కు వచ్చిన నాకు మాయమాటలు చెప్పి తన స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ కర్నూలుకి  తీసుకెళ్లి ముస్లీ సంప్రదాయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అప్పటి నుంచి వాళ్లు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. అప్పటికే గర్భావతిగా ఉన్న నాకు మళ్లీ ట్యాబ్ లెట్లు ఇచ్చి గర్భం తీయించారు. నన్ను తీసుకెళ్లడానికి వచ్చిన మా తల్లిదండ్రులను కూడా కొట్టి సంతకాలు తీసుకుని మత పెద్దల సమక్షంలో  మూడు సార్లు తలాక్ చెప్పించి పంపించారని‘ ఆ యువతి చెప్పింది.

Tagged Young woman

Latest Videos

Subscribe Now

More News