బంజారాహిల్స్లో యువతి హల్చల్.. ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకుతానంటూ బెదిరింపు

బంజారాహిల్స్లో యువతి హల్చల్.. ఆస్పత్రి బిల్డింగ్  పై నుంచి దూకుతానంటూ బెదిరింపు

హైదరాబాద్  బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది.  సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి  దూకుతానంటూ బెదిరిస్తోంది. ఆ యువతి ఎవరు ఎందుకు దూకుతానని బెదిరిస్తుందనేది తెలియాల్సి ఉంది.  ఈ ఘటనను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 ప్రధాన రహదారిపై కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ యువతిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. యువతితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కిందకు దిగిరావాలని కోరుతున్నారు.