
సుదీప్తో సేన్(Sudipto Sen) డైరెక్ట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) బాక్సాపీస్ వద్ద విజయం సాధించింది. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటి వరకు ఓటీటీ (OTT) విడుదల ఆలస్యమవుతున్న సందర్బంగా నెటిజన్స్ చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా ఈ ట్వీట్స్ కు అదాశర్మ(Adah Sharma) స్పందిస్తూ ' ఒక మంచి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50రోజులు పూర్తి చేసుకుంది. ఇది చిత్ర బృందానికే కాకుండా మొత్తం సినిమా పరిశ్రమకూ భారీ వేడుకతో సమానం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన తర్వాతనే ఓటీటీలో ప్రసారం చేస్తారు. ఏ ఓటీటీ సంస్థకు ఇవ్వాలా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే దీని ఓటీటీ (OTT) విడుదల ఆలస్యమవుతోంది’’ అని స్పందించింది.
Rukooo !!! Panic mat karo !!
— Adah Sharma (@adah_sharma) June 27, 2023
Abhi tak theatres mein chal Rahi hai #TheKeralaStory ... Now thode din aur let it be in theatres ? And then very soon apke nazdeeki cinema Ghar se aapke cell phone Tak aa jaegi. See you soon in your homes...don’t worry (unless cupboard saaf nahi hai… pic.twitter.com/iPZ1TlamON
డైరక్టర్ లవ్ జిహాద్ అంశంపై ఈ మూవీని తెరకెక్కించారు. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్లను దేశాల్ని దాటించి, వారితో భిన్నమైన రీతిలో బిజినెస్ కార్యకలాపాలు చేపిస్తారనే అంశంపై కేరళ స్టోరీ రూపొందించబడింది. ఈ మూవీ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో నడుస్తున్న సంగతి తెలిసేందే. ఇక OTT విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.