బీ అలర్ట్ : ఆధార్ కార్డ్ స్కాం.. మీ కార్డును వెంటనే ఇలా లాక్ చేయండి

బీ అలర్ట్ : ఆధార్ కార్డ్ స్కాం.. మీ కార్డును వెంటనే ఇలా లాక్ చేయండి

దేశ పౌరులకు అత్యంత ముఖ్యమైన కార్డు ఆధార్ కార్డు. బ్యాంకు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి వాటిల్లో..ఇతర ముఖ్యమైన సమయాల్లో ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు పేరిట ఇటీవల స్కామ్స్ ఎక్కువయ్యాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న మొదటికే మోసం వస్తుంది. 

ఆధార్ కార్డులో కొత్త మోసం..

ఆధార్ కార్డు దారులు తమ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడానికి mAadhaar యాప్ లేదా UIDAI వైబ్ సైట్ ను సందర్శించాలి. AePS అంటే Aadhaar Enabled Payment System అనేది ఆధార్ కార్డు దారులకు డిఫాల్ట్ గా సెట్ చేయబడింది. దీని ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్ డేటాను లాక్ చేయొచ్చు..లేదా అన్ లాక్ చేయొచ్చు. 

ఆధార్ కార్డు స్కాం నుంచి బయటపడాలంటే..?

  • మీ మొబైల్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి
  • యాప్ కోసం పాస్ వర్డ్ ను సెట్ చేసుకోండి. 
  • పాస్ వర్డ్ 4 అంకెలు ఉండాలి. 

mAadhaar యాప్ ద్వారా బయోమెట్రిక్ లను ఇలా లాక్ చేయండి..

  • mAadhaar యాప్ ను ఓపెన్ చేసి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 
  • ప్రొఫైల్ పై క్లిక్ చేయండి
  • యాప్ రైట్ సైట్ పైభాగంలో ఉన్న మెనూ ఆప్షన్ ను క్లిక్ చేయండి
  • బయో మెట్రిక్ సెట్టింగ్ లపై క్లిక్ చేయండి
  • ఎనేబుల్ బయోమెట్రిక్ లాక్ ఎంపికపై టిక్ చేయండి
  • సరే అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే..ఆధార్ లో నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
  • ఓటీపీని ఎంటర్ చేస్తే మీ బయోమెట్రిక్ వివరాలు లాక్ చేయబడతాయి.
  •  

mAadhaar యాప్ ద్వారా బయోమెట్రిక్ లను ఇలా అన్ లాక్ చేయండి..

  • mAadhaar యాప్ ను ఓపెన్ చేసి మెనూ ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • బయో మెట్రిక్ సెట్టింగ్ లపై క్లిక్ చేయండి
  • అందలో బయోమెట్రిక్ లాక్ డ్రాప్ డౌన్ పై ఎంపిక చేయండి
  • మీ బయోమెట్రిక్ తాత్కాలికంగా అన్ లాక్ చేయబడుతుంది. ఈ విషయం మీ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • అవును అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ బయోమెట్రిక్ వివరాలు 10 నిమిషాల పాటు అన్ లాక్ చేయబడతాయి.