ఆధార్ రూల్స్ మార్పు : అప్లయ్ చేసుకునే ముందు ఈ కొత్త డాక్యుమెంట్లను రెడీ చేసుకోండి..

ఆధార్ రూల్స్ మార్పు : అప్లయ్ చేసుకునే ముందు ఈ కొత్త డాక్యుమెంట్లను రెడీ చేసుకోండి..

 ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకోవడానికి/ కొత్తది తీసుకోవడానికి లేదా అప్‌డేట్ చేసుకోవడానికి అవసరమైన గుర్తింపు డాకుమెంట్స్ UIDAI (భారత విశిష్ట గుర్తింపు సంస్థ) మార్చింది. ఈ డాకుమెంట్స్  ని ప్రజలు వారి గుర్తింపు, చిరునామా, సంబంధం లేదా పుట్టిన తేదీని నిరూపించడానికి చూపించవచ్చు. ఈ కొత్త లిస్టులో పెద్దలు అంటే 18 ఏళ్లు పైబడినవారు, పిల్లలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి.

పెద్దలు అంటే 18 ఏళ్లు నిండిన వారికీ:  గుర్తింపు ప్రూఫ్ ( పేరు + ఫోటో ఉన్నది)
1. భారతీయ పాస్‌పోర్ట్, 
2. రేషన్ కార్డ్,
3.ఓటరు ID, 
4. డ్రైవింగ్ లైసెన్స్, 
5. ప్రభుత్వ సంస్థలు (కేంద్ర/రాష్ట్ర/PSU) ఇచ్చిన సర్వీస్ ID కార్డు ఫోటో, 
6. పెన్షనర్ ఫోటో ఐడి / స్వాతంత్ర సమరయోధుడు ఐడి / పెన్షన్ పేమెంట్ ఆర్డర్
7. CGHS / ECHS / ESIC / మెడి-క్లెయిమ్ కార్డ్
8. MGNREGA జాబ్ కార్డ్
9. క్యాస్ట్ సెర్టిఫికెట్  (SC/ST/OBC)
10. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇచ్చిన సర్టిఫికేట్ లేదా మార్క్‌షీట్
11. MP/MLA/MLC/గెజిటెడ్ ఆఫీసర్/తహసీల్దార్  జారీ చేసిన సర్టిఫికేట్ (UIDAI ఫార్మాట్‌లో)


2) అడ్రస్ ప్రూఫ్  (పేరు & అడ్రస్ ఉన్నది)
1. భారతీయ పాస్‌పోర్ట్
2. రేషన్ కార్డు 
3. ఓటరు ID
4. అడ్రస్ ఉన్న ప్రభుత్వ సంస్థల సర్వీస్ ఐడి
5. పెన్షనర్ ID / పెన్షన్ పేమెంట్ ఆర్డర్
6. MGNREGA జాబ్ కార్డ్
7. క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/OBC)
8. విద్యుత్ బిల్లు (3 నెలల కంటే పాతది కాకూడదు)
9. నీటి బిల్లు (3 నెలల కంటే పాతది కాకూడదు)
10. ల్యాండ్‌లైన్/మొబైల్ పోస్ట్‌పెయిడ్/బ్రాడ్‌బ్యాండ్ బిల్లు (3 నెలల కంటే పాతది కాకూడదు)
11. గ్యాస్ బిల్లు (3 నెలల కంటే పాతది కాకూడదు)
12. ప్రభుత్వ కేటాయింపు లెటర్ (1 సంవత్సరం లోపు జారీ చేసింది)
13. ఆస్తి పన్ను రసీదు (1 సంవత్సరం లోపుది)
14. రిజిస్టర్డ్ సేల్ డీడ్ / గిఫ్ట్ డీడ్ / లీజు ఒప్పందం
15. బ్యాంక్ పాస్‌బుక్ / బ్యాంక్ స్టేట్‌మెంట్ (సంతకం చేసి, స్టాంప్ వేసి ఉండాలి)
16. ఇన్సూరెన్స్ పాలసీ (జారీ చేసిన తేదీ నుండి 1 సంవత్సరం వరకు చెల్లుతుంది)


3) పుట్టిన తేదీ ప్రూఫ్ (POB – పుట్టిన తేదీ ఉన్న డాక్యుమెంట్ )
1. జనన ధృవీకరణ పత్రం (Birth Certificate)
2. భారతీయ పాస్‌పోర్ట్
3. బోర్డు/యూనివర్సిటీ నుండి పుట్టిన తేదీని చూపించే సర్టిఫికెట్/మార్క్‌షీట్
4. పుట్టిన తేదీతో కూడిన పెన్షన్ ఆర్డర్


4) సంబంధిత ఆధారం (POR –  Proof of Relationship)
మీరు మీ కుటుంబ పెద్ద (HOF - Head of Family) ద్వారా ఆధార్ రిజిస్టర్ చేయిస్తుంటే, మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని చూపడానికి  విటిలో ఏదో ఒకటి అవసరం:
1. బర్త్ సర్టిఫికెట్
2. తల్లిదండ్రుల పేరును చూపించే క్యాస్ట్ సర్టిఫికెట్  
3. కుటుంబ లింకేజీతో  MGNREGA జాబ్ కార్డ్
4. ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిలేషన్షిప్  సర్టిఫికెట్ 


 5 సంవత్సరాల లోపు పిల్లలకు:
1. జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) లేదా, కుటుంబ పెద్ద (HOF) ఆధారంగా నమోదు పత్రం (POR).

5–18 సంవత్సరాల పిల్లలకు:
1. పెద్దల లిస్టులో  ఉన్న ఏదైనా POI (గుర్తింపు రుజువు) పత్రం.
2. పెద్దల లిస్టులో  ఉన్న ఏదైనా POA (చిరునామా రుజువు) పత్రం.
3. ఏదైనా POB (పుట్టిన తేదీ రుజువు) పత్రం లేదా PORతో కుటుంబ పెద్ద (HOF) ఆధారంగా నమోదు.