‘శంబాల’ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్‌పైకి వచ్చిన ఆది సాయి కుమార్.. త్వరలో ఓ ప్రేమకథా చిత్రంతో నటించబోతున్నాడు. ‘సైరాబాను’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి కో ప్రొడ్యూసర్. ఇందులో ఆదికి జంటగా బంధవి శ్రీధర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోహీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టగా.. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
కోన వెంకట్, ‘కే రాంప్’ డైరెక్టర్ నాని మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఫస్ట్ షాట్‌కు డైరెక్టర్ యోగి గౌరవ దర్శకత్వం వహించారు. హైదరాబాద్, రాజమండ్రి నేపథ్యంలో హాస్యం మేళవించిన హిందూ, ముస్లిం ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
