"సీఎస్ఐ సనాతన్" టీజర్ రిలీజ్

"సీఎస్ఐ సనాతన్" టీజర్ రిలీజ్

చాగంటి ప్రొడ‌క్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీఎస్ఐ) ఆఫీస‌ర్ గా ఆది సాయికుమార్ నటించాడు. ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా దర్శకుడు బాబీ విడుదల చేశాడు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విషెస్ తెలిపాడు.

ఈ టీజర్ ఎలా ఉందంటే.. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించాడు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.

న‌టీ న‌టులు -ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్,  వాసంతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం:
సినిమాటోగ్రఫీ:  జిశేఖ‌ర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ : జియ‌స్ కె మీడియా
నిర్మాత : అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శకుడు : శివ‌శంక‌ర్ దేవ్