చెన్నమనేనికి మాజీ ఎమ్మెల్యే హోదా కల్పించవద్దు ..ఫించన్​ ఇవ్వొద్దు: ఆది శ్రీనివాస్​

చెన్నమనేనికి  మాజీ ఎమ్మెల్యే హోదా కల్పించవద్దు ..ఫించన్​ ఇవ్వొద్దు: ఆది శ్రీనివాస్​

చెన్నమనేని రమేష్​ భారత చట్టాలను ఉల్లంఘించాడని .. అతనిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్​సీఐడీ అధికారులకు ప్రభుత్వ విప్​ ఆదిశ్రీనివాస్​ ఫిర్యాదు చేశారు.  తాను 2009 నుంచి  చెన్నమనేని రమేష్​ పై న్యాయపోరాటం చేస్తున్నానని తెలిపారు. 14 ఏళ్ల వనవాసం తరువాత ధర్మం గెలిచిందన్నారు.   చెన్నమనేనికి సంబంధించిన భారత చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి అన్ని పత్రాలను.. కోర్టు కాపీలను సీఐడీ అధికారులకు అందజేశానన్నారు. 

2009 నుంచి వేములవాడ ఎమ్మెల్యే గా చెన్నమనేని పేరు రికార్డుల్లో ఉందని..  ఎన్నికల పిటిషన్ పై ప్రత్యేక విచారణ జరిపి రెండో స్థానంలో ఉన్న తనను  ఎమ్మెల్యే గా ప్రకటించాలని లేకపోతే  ఖాళీగా చూపించాలని ఆది శ్రీనావాస్​ అన్నారు.   ఎమ్మెల్యే గా చెన్నమనేని తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని.. ఆయనకు  మాజీ ఎమ్మెల్యేకు ఉండే బెనిఫిట్స్​ రద్దు చేయాలంటూ...  పింఛన్ ఇవ్వొద్దని డిమాండ్​ చేశారు.

చెన్నమనేని భారత పౌరుడు కాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో తన తప్పును అంగీకరించి రూ. 30 లక్షలు జరిమానా చెల్లించాడన్నారు.  
భారత పౌరుడు కాదని న్యాయస్థానం స్పష్టం చేయడంతో తప్పును ఒప్పుకొని 30 లక్షల జరిమానా చెల్లించాడు.. ఈ తీర్పు తో న్యాయస్థానాల పైన మరింత నమ్మకం పెరిగింది.. తప్పుడు ధ్రువీకరణ ప్రతాలతో కోర్టులను రమేష్ బాబు తప్పుదోవ పట్టించారని.. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండేందుకే చెన్నమనేనిపై న్యాయ పోరాటం చేశానన్నారు. భారత చట్టాలకు అనుగుణంగా చెన్నమనేని రమేష్ పైన చర్యలు తీసుకోవాలన్నారు.

భారత చట్టాలతో ఆడుకున్న చెన్నమనేని రమేష్​ ఏ పాస్​ పోర్ట్​ తో ఇండియాకు వచ్చి వెళుతున్నాడో అర్దం కావడం లేదన్నారు. భారతదేశం చట్టం ప్రకారం దేశ పౌరసత్వం ఉన్నవారే ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలి... దేశ పౌరసత్వం లేకుండా రమేష్​బాబు ఒక్కరే ప్రజాప్రతినిథిగా ఎన్నికయ్యారని  ఎన్నికల సంఘం లేదా సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని కోరారు.