ఆదికేశవ... నవంబర్‌‌‌‌కు వాయిదా

ఆదికేశవ... నవంబర్‌‌‌‌కు వాయిదా

వైష్ణవ్ తేజ్,  శ్రీలీల జంటగా  తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో  సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చూన్‌‌ ఫోర్‌‌ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ని శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 18న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. షూటింగ్ పూర్తి  కాకపోవడంతోనే రిలీజ్‌‌ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలియజేశారు. 

ఇటీవలే ప్యారిస్‌‌ షెడ్యూల్ పూర్తయింది. ఇంకా కొంత పార్ట్ షూట్ బ్యాలెన్స్ ఉంది. యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా మాస్ లుక్‌‌లో కనిపించనున్నాడు వైష్ణవ్.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక ఇతర  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.